దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ విచారణకు హాజరుకాలేనని ఆ సంస్థ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలో కవిత మీడియా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు, విచారణపై కవిత ఈ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ కేసులో నేడు విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 9, 10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని.. 11న హాజరవుతానని బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు 10న దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకు రావాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు, భారత్ జాగృతి నిరసన కార్యక్రమాలపై కవిత స్పందించనున్నారు.