కమిషన్లు, దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా : ఎమ్మెల్సీ మధుసూదన్

-

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భద్రాచలంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు. కాంట్రాక్టులు, కమిషన్లు, ఇసుక దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా.. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా 30% పైగా రైతు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ వస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అని కేసీఆర్ గారు చెప్పిన మాటలు అక్షరాల నిజం. మళ్లీ పాత రోజులు పల్లెల్లో దర్శనమిస్తున్నాయి. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.

పదేళ్ల కెసిఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఒక్క వాటర్ ట్యాంకర్ కూడా రాలేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎటు చూసిన వాటర్ ట్యాంకర్లు దర్శినిస్తున్నాయి. గోదావరి పరివాహ ప్రాంతమంతా ఇసుక వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది.. ఇసుక మాఫియా మీద ఉన్న ప్రేమ ప్రజల మీద కాంగ్రెస్ సర్కార్ ప్రేమ లేదు. 2000 రూపాయల పింఛను 4000 పెంచుతామని చెప్పి పింఛను పెంచకుండా కాలయపన పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మధుసూదన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news