సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా ప్రజాప్రభుత్వానికి సహకరిస్తామని సీఎం రేవంత్‌కు శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.ఇదిలాఉండగా,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీద పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.కాగా, సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ముందే శ్రీపాల్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి సపోర్టు కోరినట్లు తెలిసింది.