వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. మున్సిపల్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని, మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలోనే అధికారులను లోనికి వెళ్లనివ్వకుండా మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో రోజువారి ఆఫీస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా వేతనాల విషయంపై సమాధానం లేకుండా పోయిందని, అందుకే కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టినట్లు సిబ్బంది స్పష్టంచేశారు.
https://twitter.com/TeluguScribe/status/1897529418383278457