వినియోగదారులకు షాక్‌.. పెరగనున్న మొబైల్స్‌ రేట్లు..!

-

కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు షాకింగ్‌ లాంటి వార్త చెప్పింది. మొబైల్‌ ఫోన్లు, వాటి విడి భాగాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీ రేటును 18 శాతానికి పెంచినట్లు తెలిపింది. దీంతో మొబైల్స్‌ రేట్లు పెరగనున్నాయి. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నందున అప్పటి నుంచి ఫోన్ల ధరలు పెరగనున్నాయి.

శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో నిర్వహించిన 39వ జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొబైల్‌ ఫోన్లు, కొన్ని విడి భాగాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీ రేటును 18 శాతానికి పెంచినట్లు తెలిపారు. అలాగే యంత్రాలు, చేత్తో తయారు చేసే అగ్గిపుల్లలపై ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న జీఎస్‌టీని 12 శాతం చేశారు. ఇక ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాల్‌ సేవలపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతం చేశారు. అలాగే రూ.2 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు 2018, 2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆలస్యంగా దాఖలు చేసిన వార్షిక రిటర్నులపై ఆలస్య రుసుమును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

జీఎస్‌టీ నెట్‌వర్క్‌ కెపాసిటీని పెంచేందుకు అవసరం అయిన మానవ వనరులను సరఫరా చేయాలని ఇన్ఫోసిస్‌కు మంత్రి సీతారామన్‌ సూచించారు. అలాగే జూలై 2020 నాటికి జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరచాలని ఆమె ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version