దేశంలో తొలి సోలార్ గ్రామం ‘మొఢేరా’

-

దేశంలో తొలి సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొఢేరా గ్రామం రికార్డు నెలకోల్పనుంది. నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మొఢేరాలో సోలార్‌ను ఆవిష్కరించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ గ్రామంలో చారిత్రక సూర్య దేవాలయంలో విద్యుద్దీపాలంకరణ, 3డీ ప్రొజెక్షన్ వంటివి సౌర విద్యుత్‌తోనే నడుస్తాయి. సౌర విద్యుత్‌తో ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వెలుగులు చూడవచ్చు.

మొఢేరా-సౌర విద్యుత్
మొఢేరా-సౌర విద్యుత్

ఆలయ అభివృద్ధికి, సౌర విద్యుత్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ప్రధాని కలల సాకారంలో గుజరాత్ ముందు వరుసలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ద్వారా సూర్యదేవాలయంలోపాటు మొఢేరా గ్రామంలో సౌర విద్యుత్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం గుజరాత్ ప్రభుత్వం 18 ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. దీని కోసం రాష్ట్రం రూ.80.66 కోట్ల నిధులు ఖర్చు చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version