భారత్ కు మోడర్నా వ్యాక్సిన్ వచ్చే అవకాశం.. కోవాక్స్ ద్వారా సరఫరా..!

-

కరోనా వైరస్ కట్టడిలో అగ్రదేశాలు వ్యాక్సిన్ తయారు చేయటంలో పోటీపడుతున్నాయి. యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ 94.5 శాతం విజయవంతమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఇప్పుడు వ్యాక్సిన్ దేశీయంగా అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోవాక్స్‌ సౌకర్యాల ద్వారా ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశాయి. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్ నెస్‌ ఇన్నోవేషన్స్‌ సహకార సమితి (సీఈపీఐ) నుంచి గతంలోనే మోడర్నా ఇంకుకు నిధుల సహాయం అందినట్లు వివరించాయి. సీఈపీఐ కోవాక్స్‌లో భాగం కావడంతో ఇండియా సైతం వ్యాక్సిన్‌ను పొందనున్నట్లు తెలియజేశాయి.

covax

వచ్చే ఏడాది (2021) చివరికల్లా కోవాక్స్‌ సౌకర్యాల ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకు 2 బిలియన్‌ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోవాక్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెల్త్‌కేర్‌ రంగ నిపుణులు తెలిపారు. జనవరిలో మోడర్నా ఇంక్‌కు సీఈపీఐ విడుదల చేసిన 1 మిలియన్‌ డాలర్ల ద్వారా మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో వ్యాక్సిన్‌ అభివృద్ధికి పాక్షికంగా నిధులు అందజేసింది. ఫలితంగా మోడర్నా ఇంక్‌ పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

దేశీ ఫార్మా కంపెనీలతో మోడర్నా ఇంక్‌ కు ఒప్పందాలేవీ లేవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీంతో మోడర్నా తొలుత వ్యాక్సిన్‌ ను యూఎస్‌ ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేశాయి. మోడర్నా ఇంక్ ఆచరించిన ఎంఎన్‌ఆర్‌ఏ పద్ధతిలోనే ఫైజర్‌ ఇంక్‌ సైతం వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్‌ సైతం 90 శాతంపైగా ఫలితాలు సాధించినట్లు ఇప్పటికే యూఎస్‌ హెల్త్‌కేర్‌ దిగ్గజం ఫైజర్‌ ప్రకటించింది. అయితే మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్‌ను 2-8 సెల్సియస్‌ లలో నిల్వ చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, తొలత వ్యాక్సిన్ యూఎస్ ప్రభుత్వానికి సరఫరా చేయాలని మోడెర్నా చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ స్వాగతించారు. తన హయాంలోనే ఈ ఆవిష్కరణ జరిగిందని ట్రంప్ ట్వీట్ చేయగా.. వ్యాక్సిన్ పై ప్రకటన భవిష్యత్తుపై ఆశలు పెంచుతోందని బైడెన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version