ఈ రోజు మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్యన ప్రయాణించే వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికీ ఈ మార్గమధ్యంలో ట్రైన్ లు ఉన్నప్పటికీ.. ఈ కొత్త ట్రైన్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని శంకుస్థాపనల పనులను ముగించుకుని వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీని రిసీవ్ చేసుకోవడానికి వహ్సిన తెలంగాణ మంత్రి తలసాని, గవర్నర్ తమిళిసై , బీజేపీ ఎంపీలు వచ్చారు.
తెలంగాణ పర్యటన: బండి సంజయ్ కు మోదీ స్పెషల్ విషెస్ !
-