తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమంత బాగాలేవని చెప్పాలి. గ్రూప్ 1 మరియు టెన్త్ క్లాస్ పేపర్ ల లీక్ వలన అధికార మరియు విపక్షాల మధ్యన పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఇందులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి 14 రోజుల వరకు రిమాండ్ లో ఉంచాలని హనుమకొండ మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపైన బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న సికింద్రాబాద్ పర్యటనకు రానున్నారు.
పోయిన సారి ఇదే విధంగా మోదీ తెలంగాణకు రాగా బీజేపీ మరియు బి ఆర్ ఎస్ కార్యకర్తల మధ్యన పోస్టర్ ల వార్ జరిగింది. ఇంకా ఇరుపక్షాలు అనే ఆరోపణలు మరియు విమర్శలు చేసుకున్నారు. మరి ఈ సారి ఏమి జరుగుతుందో చూడాలి. కాగా ఇప్పటికే ఆరోజున కేటీఆర్ సింగరేణి ప్రయివేటీకరణ నిలపాలి అన్న దానికి నిరసనలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.