మోడీ కేసీఆర్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే – రేవంత్ రెడ్డి

-

ప్ర‌ధాని మోడీ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఇద్ద‌రు కూడా తోడు దొంగ‌ల‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ ల‌ని విమ‌ర్శించాడు. రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కు తీసుకుంటే అవి మా గొప్ప అని కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోడీ చట్టాలు తెచ్చినపుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చెయ్యలేద‌ని గుర్తు చేశారు. ఏ ఒక్క రోజు రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదు.. ఒక్క రైతును పరమర్శించలేదు ని అన్నారు.

ఇప్పుడు కేసీఆర్ ఒక్క పూట ధర్నా చేస్తేనే భయపడి మోడీ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటే మరి రైతులు పండించిన పంటలకు ఎందుకు కొనేలా చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలను రూపొందిచార‌ని ఆరోపించారు. అయితే రైతుల వ్యతిరేకత వ‌ల్లే ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్నారని తెలిపారు. మోడీ దేశాన్ని కేసీఆర్ రాష్ట్రాన్ని ద్రోహం చేస్తున్నారని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version