ఆందోళనల్లో వెనక్కి తగ్గేదే లేదు– రైతు సంఘాలు.

-

కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నా. .రైతులు తమ ఆందోళనల్లో వెనక్కి తగ్గం అంటున్నారు. ఈరోజు సమావేశమైన సంయుక్త కిసాన్ మోర్చా దీనిపై ప్రకటన చేసింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పిన్పటికీ.. ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా నిరసన కార్యక్రమాలు ప్రారంభించి ఏడాది కావస్తున్న తరుణంలో… ఈనెల 26న దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఆందోళనల్లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని కోరారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో పరేడ్ నిర్వహిస్తామని వెల్లడించింది.

‘దాదాపు 670 మంది రైతులు బలిదానం చేసుకున్నారని, వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని. వారి  పోరాటానికి గుర్తుగా స్మారకాన్ని నిర్మించాలి రైతు సంఘాలు కోరుతున్నాయి. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంతియుత ట్రాక్టర్ ర్యాలీలను నిర్వహిస్తాం అని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. భవిష్యత్​ కార్యచరణ, కనీస మద్దతు ధరపై పోరాటానికి సంబంధించిన తుది నిర్ణయం ఆదివారం తీసుకుంటామని వెల్లడించింది. ఎమ్​ఎస్​పీ బిల్లును తీసుకురావాలని,  విద్యుత్​ బిల్లులను రద్దు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version