దేశంలో రోజురోజుకీ బిజెపి పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తరువాత కేంద్రంలో రెండోసారి బలమైన ప్రభుత్వాన్ని స్థాపించి రెండోసారి ప్రధానిగా మోడీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక పౌరసత్వ సవరణ చట్టం మరియు ఇంకా కొన్ని బిల్లులు తీసుకురావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ కి బ్యాడ్ డేస్ మొదలైంది. ఇటువంటి సమయంలో మూడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు సదరు రాష్ట్ర ప్రజలు.
ఇదే సమయంలో రాజ్యసభలో కూడా బిజెపి బలం బాగా తగ్గుతుంది. దీంతో ముందుచూపుతో ఉన్న బిజెపి దక్షిణాది రాజకీయాలలో కీలక రాజకీయ నాయకుడిగా రాణిస్తున్న జగన్ మాత్రమే తమ దిక్కు అన్నట్టుగా ప్రస్తుతం ప్రధాని మోడీ సరెండర్ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళితే రాజ్యసభలో 55 ఎంపీస్థానాలకు ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 23 భాజపా స్థానాలే. ఈ 23 స్థానాలను భాజపా తిరిగి నిలబెట్టుకునే పరిస్థితి లేదు. 2-3 సీట్లు కోల్పోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ బలం పెరుగుతుంది.
ఇతర పక్షాల బలాలు కూడా పెరుగుతాయి. తెరాస, వైకాపా బలం కూడా పెరుగుతుంది. ఇటువంటి తరుణంలో కీలక బిల్లులు రాజ్యసభలో పాస్ కావాలంటే ఖచ్చితంగా చిన్న పార్టీల సాయం అవసరమవుతుంది. దీంతో తాజాగా మోడీ సర్కార్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఆధారం చేసుకుని రాజ్యసభలో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్లు ఈ సీక్రెట్ ఇటీవల బయటపడింది. త్వరలో కీలక బిల్లులు కొన్ని రాజ్యసభ ముందుకు రానున్నాయి. దీంతో ఆ బిల్లులను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ…రాజ్యసభలో వాటికి అడ్డురాకుండా జగన్ పై ఆధార పడినట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.