అంతం చేసేస్తాం.. జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్

-

రాకేష్ మాష్టర్, శ్రీరెడ్డి వ్యవహారం మొదలై దాదాపు రెండు వారాలవుతుంది. ఆ మధ్య రాకేష్ మాష్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీరెడ్డిపై ఫైర్ అయ్యాడు. అంతేకాకుండి తెలుగు సినిమా పరిశ్రమలోని లొసుగులు, పెద్దల వ్యవహారాలు, వారి ఇంట్లో జరిగే వాటి గురించి ఇలా ప్రతీ దాన్ని టచ్ చేశాడు. మోహన్ బాబు, మంచు లక్ష్మీ, బాలయ్య, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా అందర్నీ ఓ రౌండ్ వేసుకున్నాడు.

రాకేష్ మాష్టర్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి శ్రీరెడ్డి శివాలెత్తింది. రాయలేని పదజాలంతో విరుచుకుపడింది. అంతేకాకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని చెన్నై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణిలపై శ్రీరెడ్డి కంప్లైంట్ చేసింది. అదంతా ఓ క్షణం పక్కన బెడితే.. రాకేష్ మాష్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు కూడా నటిస్తాడని, ఆ ఒక్క రోజు మాత్రం వెళ్లి సమాధి వద్ద హడావిడి చేస్తాడని యంగ్ టైగర్ గురించి కామెంట్ చేశాడు. తనకు పెద్ద ఎన్టీఆర్ అంటే ఇష్టమని, అంత మాత్రాన ఆ కుటుంబం మొత్తాన్ని ఇష్టపడాలా? అంటూ మాట్లాడాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్‌ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version