రైతులకు తీపికబురు: ఇక నుంచి నెలకు 3 వేల పింఛను.. నమోదు చేసుకోండి ఇలా..!

-

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఎకరానికి ఆరువేల రూపాయలను మూడు దఫాలుగా అందిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. దానికోసం రైతు బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతే కాదు రైతు బీమా పేరుతో రైతులకు బీమా సౌకర్యాన్ని కూడా ఉచితంగా కల్పిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఎకరానికి ఆరువేల రూపాయలను మూడు దఫాలుగా అందిస్తోంది.

అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి… 60 ఏళ్లు దాటిన రైతుల కోసం బ్రహ్మాండమైన పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్ లోనే ఈ పథకాన్ని ప్రకటించగా.. ఈరోజు నుంచి ఆ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.

ఆ పథకం పేరే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. దాన్నే పీఎం కేఎంవై అని కూడా అంటారు. ఈ పథకంలో చేరిన రైతులు 60 ఏళ్లు దాటాక నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందుతారు.

ఈ పథకం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తిస్తుంది. కాకపోతే.. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న రైతుల ఈ స్కీమ్ లో చేరొచ్చు. ఇది వాలంటరీ కంట్రిబ్యూషన్ ఆధారిత పెన్షన్ స్కీమ్. దీంట్లో చేరాలనే ఆసక్తి ఉన్న రైతులే చేరొచ్చు. బలవంతం ఏమీ ఉండదు.

ఈ స్కీమ్ లో చేరాలనుకునే రైతులు కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీ) వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కు వాళ్లు 30 రూపాయలు తీసుకుంటారు. ఆ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

వయసును బట్టి రైతులు.. నెలకు 55 రూపాయల నుంచి 200 వరకు చెల్లించొచ్చు. రైతులు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా చెల్లిస్తుంది.

ఈ పథకంలో భార్యభర్తలు ఇద్దరు కూడా చేరొచ్చు. విడివిడిగా పథకంలో సభ్యులుగా మారొచ్చు. ఒకవేళ స్కీమ్ లో చేరిన తర్వాత రిటైర్మెంట్ కంటే ముందే మరణిస్తే… అప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. ఒకవేళ భర్త చనిపోతే భార్య.. భార్య చనిపోతే భర్త.. ఆ స్కీమ్ ను కొనసాగించవచ్చు. ఎవరూ లేకపోతే ఆ డబ్బను నామినీకి చెల్లిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version