మోడీ ప్రభుత్వం గాంధీ హంతకులను గొప్పవారిగా చిత్రీకరిస్తుంది: సోనియా గాంధీ

-

నవ సంకల్ప్ శిబిర్ సమావేశాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది అని అన్నారు. రాజ్యాంగ సంస్థలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్నారు సోనియా. మోడీ పాలన ఇలాగే కొనసాగితే దేశం దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

బీజేపి దేశంలో మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెంచారని అన్నారు. మైనారిటీలు కూడా దేశంలో భాగమేనని విషయాన్ని గ్రహించాలని అన్నారు. ప్రతిపక్ష నేతల పైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. గాంధీ హంతకులను గొప్పవారిగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలు, మహిళలు, దళితులపై రోజు రోజుకీ దాడులు పెరుగుతున్నాయి అన్నారు సోనియా గాంధీ.2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు.రైతుల సుదీర్ఘ పోరాటానికి తలవొగ్గి..నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నా సమస్యలు పరిష్కారం మాత్రం కాలేదని అన్నారు సోనియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version