ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నీతి అయోగ్ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ప్రముఖ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సిఈఓలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ప్రపంచ చమురు మరియు గ్యాస్ రంగంలో భారతదేశం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ముడి చమురు లో 3 వ అతిపెద్ద వినియోగదారుగా ఇండియా ఉంది.
4 వ అతిపెద్ద ఎల్‌ఎన్‌జి దిగుమతిదారుగా ఉంది. నీతి అయోగ్ ఆయోగ్, గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈఓల యొక్క మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 2016 లో ప్రధానితో ప్రారంభించింది. ప్రపంచ చమురు మరియు గ్యాస్ రంగాన్ని ప్రభావితం చేసే 45 నుండి 50 మంది గ్లోబల్ సీఈఓలు మరియు ముఖ్య వాటాదారులు ప్రతీ ఏటా మోడీతో సమావేశమై చర్చిస్తారు. అప్పటి నుంచి ఇది 5 వ కార్యక్రమం.