సీఎంల మోడీతో భేటీ కావాల్సిందే…?

-

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావాల్సిన సమయం దగ్గర పడింది. ఎందుకు ఏంటనేది చూస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఒకటి… రెండోది కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రాష్ట్రాల విషయంలో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని కొంత మంది కోరుతున్నారు.

రెండు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేస్తున్నారు. మహారాష్ట్ర కర్ణాటక లో కూడా ఈ కార్యక్రమానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కొరత ఎక్కువగా ఉండటంతో మొదటి డోసు తీసుకున్న వాళ్ళు రెండో డోస్ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రధానమంత్రి మోడీ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలను వివరించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.

ఇప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆగిపోతే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం కనబడటం లేదు. కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా త్వరలోనే కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే తమకు వ్యాక్సిన్ కావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా పంపించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version