అమ్మో ఆమె జీతం గంటు 54 లక్షలు ?

-

వాట్ ? నెలకు లక్ష సంపాదించడానికే నానా ఇబ్బందులూ పడుతున్నాం, అలాంటిది ఏకంగా ఓ మహిళ జీతం గంటకు రూ.54 లక్షలా ? అని ఆశ్చర్యంగా ఉందా ? అవును మీ ఆశ్చర్యానికి అర్ధం ఉంది. ఆమె జీతం గంటకు రూ.54 లక్షలే. అంటే రోజుకు రూ.13 కోట్లు.. ఏడాదికి 4వేల కోట్లు.. 53 ఏళ్ల డెనిస్‌ కొయెత్స్‌ అనే మహిళ లండన్ లో ఉంటోంది.

ఆన్‌లైన్‌ జూదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బెట్‌ 365 కంపెనీకి ఆమె బాస్‌. మొన్న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణా ఆమెకు అందేది 469 మిలియన్‌ పౌండ్లు. ఇందులో వేతనం 421 మిలియన్‌ పౌండ్లతోపాటు, కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్‌ కింద మరో 48 మిలియన్‌ పౌండ్లు అదనంగా వస్తాయి.  అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version