బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ వర్షాల ధాటికి దాదాపు 20 మందికిపైగా మరణించినట్లు సమాచారం అందుతోంది. కేవలం కడప జిల్లాలోనే 13 మంది మృతి చెందడం గమనార్హం.

ఇక అటు తిరుపతిలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఈ సందర్భంగా ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఐదు జిల్లాల్లో వర్షాల పరిస్థితులు అలాగే సహాయక చర్యలను ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ వివరించారు.

కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. “రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం జగన్ తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.” అంటూ తెలుగు లో ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version