ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు ఆస్తి నష్టం తో పాటు ప్రాణం నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రోజు కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల ఉద్ధృతి తీవ్రం గా ఉంది. దీంతో వరద నీరు భారీ గా రావడం తో కడప జిల్లా లో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగింది. దీంతో చెయ్యేరు నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో జిల్లా లో 30 మంది ఈ చెయ్యేరు నది లో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారిలో గండ్లూరు లో 7 మృత దేహాలు, రాయవరం లో 3, మండ పల్లి లో 2 మొత్తం గా 12 మృత దేహాలు లభ్యం అయ్యాయి.
అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ తో పాటు పింఛా ప్రాజెక్ట్ కట్ట కూడా తెగి పోవడం తో చెయ్యేరు నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో నీరు దిగువ కు భారీ గా వస్తుంది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు ను ముమ్మురం చేసింది. 2 హెలికాప్టర్ల తో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. కాగ ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు ఇంకా తగ్గు ముఖం పట్ట లేదు. ఇంకా వర్షాలు మూడు రోజుల పాటు పడే అశకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది.