తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి – మోడీ

-

తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని మోడీ అన్నారు. త్రిపురలో ,అస్సాం,హర్యానా లో అధికారంలోకి వచ్చామని.. ఒక్క సారి వస్థే ప్రజలు మళ్ళీ మళ్ళీ బిజెపికి అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. తెలంగాణ కు అవినీతి పాలన, కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలని పేర్కొన్నారు.

హైదరా బాద్ కార్యకర్తలను కలవాలని సంజయ్ ఆదేశించారని.. కార్యకర్తలకు అభినందనలు చెప్పేందుకు వచ్చానని వెల్లడించారు. కార్య కర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ భారత మాత కోసం యుద్ధం చేస్తున్నారని.. నిరాశలో పడ్డ ఇక్కడి సర్కార్ బిజెపి కార్యకర్తల పై దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ పేరుతో అన్ని అనుభస్తున్నారు… ఆ కుటుంబం ముందుకు వెళ్ళింది…తెలంగాణ వెనక్కి వెళ్ళిందని.. ఇక్కడ టాలెంట్ ను ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version