కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గానే మోదీ..అదిరే లాజిక్‌లతో.!

-

తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ..పలు అభివృద్ధి పనులని ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ.11 వేల కోట్లతో పలు కార్యక్రమాలు ప్రారంభించారు. అటు సికింద్రాబాద్ టూ తిరుపతి వందే భారత్ రైలుని ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ..తెలంగాణకు కేంద్రం చేస్తున్న సాయం గురించి చెప్పారు.

దాదాపు రూ. 35 వేల కోట్లు తెలంగాణ రోడ్లకు ఖర్చు పెట్టామని, ఇక దేశంలో 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఒకటి తెలంగాణలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. దీని ద్వారా తెలంగాణలో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. సికింద్రాబాద్ టూ తిరుపతికి వందే భారత్ రైలు వేయడంపై స్పందిస్తూ.. ఈ భాగ్యనగరాన్ని వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇక తర్వాత నుంచి కే‌సి‌ఆర్ కుటుంబం టార్గెట్ గానే మోదీ విరుచుకుపడ్డారు. అభివృద్ధిలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. దీని వల్ల అభివృద్ధి పనులు పెండింగ్ లో పడుతున్నాయని, ఇక పనిచేస్తున్న వాళ్ళతో కొంతమంది ఇబ్బందిపడుతున్నారని, అలాంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని,  తెలంగాణలో కుటుంబ పాలనలో అవినీతి పెరిగిందని, కొందరు గుప్పిట్లోనే అధికారం మగ్గుతుందని అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు అంటే వారికి గిట్టడం లేదని, సొంత కుటుంబం ఎదిగితే చాలని అనుకుంటున్నారని కే‌సి‌ఆర్ కుటుంబం టార్గెట్ గా ఫైర్ అయ్యారు.

అన్నీ విషయాల్లో తమ కుటుంబ స్వార్ధం చూసుకుంటున్నారని, కుటుంబ వాదంతో అవినీతి పెంచి పోషిస్తున్నారని, అలాంటి వల్ల పట్ల తాను కఠినంగా ఉంటున్నానని, ఇలా తనదైన శైలిలో మోదీ..కే‌సి‌ఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు.  ఇదిలా ఉంటే మోదీ పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం సి‌ఎం కే‌సి‌ఆర్ హాజరు కావాలి..కానీ ఆయన హాజరు కాలేదు..ఆయన బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..మోదీని రిసీవ్ చేసుకున్నారు. అందుకే తమతో తెలంగాణ ప్రభుత్వం కలిసిరాలేదని మోదీ అన్నారు. ఇక మోదీ విమర్శలకు బి‌ఆర్‌ఎస్ ఎలా కౌంటర్లు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version