ఈ ఏడాది సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగిన జి 20 సదస్సు 15 వ ఎడిషన్ కు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హాజరయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంపై చూపించిన ప్రభావం గురించి ఆయన ఇతరదేశాల అధినేతలతో చర్చించారు. వీరిలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు.
దీనిపై మోడీ ట్వీట్ చేసారు. “జి 20 నాయకులతో చాలా ఉపయోగకరమైన చర్చ జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమన్వయ ప్రయత్నాలు ఈ మహమ్మారి నుండి వేగంగా కోలుకోవడానికి దారి తీస్తాయి. వర్చువల్ సమ్మిట్ నిర్వహించినందుకు సౌదీ అరేబియాకు ధన్యవాదాలు” అని పిఎం మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మానవజాతి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు అని మరియు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు” అని అన్నారు.
Had a very fruitful discussion with G20 leaders. Coordinated efforts by the largest economies of the world will surely lead to faster recovery from this pandemic. Thanked Saudi Arabia for hosting the Virtual Summit. #G20RiyadhSummit
— Narendra Modi (@narendramodi) November 21, 2020