మధ్యప్రదేశ్ పోలీసులు దాని అసలైన యజమానులను నిర్ధారించే ప్రయత్నంలో మూడేళ్ల లాబ్రడార్ కుక్కకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఆసక్తికరంగా మారిన ఈ ఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే హోషంగాబాద్ దేహాట్ పోలీస్ స్టేషన్, ఇన్‌ఛార్జి హేమంత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, దాదాపు మూడు నెలల క్రితం షాదాబ్ ఖాన్ అనే జర్నలిస్ట్ తన మూడేళ్ల కుక్క కోకో కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. అలానే నవంబర్ 18 న అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఎబివిపి) నాయకుడు క్రాటిక్ శివారే ఇంట్లో తన కుక్క ఉన్నాయి పేర్కొన్నారు.
షాదాబ్ పోలీసులను పిలిచి కుక్కను తనతో తీసుకువెళ్ళాడు. తరువాత, నవంబర్ 19 న శివహారే పోలీస్ స్టేషన్కు చేరుకుని కుక్క తనదని పేర్కొంది. అతను కుక్క పేరు టైగర్ అని చెప్పాడు. అలానే తాను కొన్ని వారాల క్రితం ఇటార్సీ నుండి కుక్కను కొన్నానని చెప్పాడని అంటునారు. ఈ కుక్క ఏమో కోకో మరియు టైగర్ అనే రెండు పేర్లకు స్పందిస్తోందని, అలానే ఇప్పుడు ఈ ఇద్దరితో కూడా స్నేహంగా ఉందని శ్రీవాస్తవ తెలిపారు. “వారిద్దరూ ఈ కుక్కను వదులుకోవడానికి సిద్దంగా లేనందున మేము DNA పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు.