అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ముందుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ బస చేస్తున్న బ్లెయిర్ హౌస్‌కు డోజ్ సారథి ఎలాన్ మస్క్ తన కుటుంబంతో కలిసి వచ్చారు. మస్క్ వెంట ఆయన సతీమణి షివోన్ జిలిస్.. ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్,అజూర్‌లు ఉండగా.. వీరంతా మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంరతం మస్క్ పిల్లలకు మోడీ కొన్ని పుస్తకాలను బహుమతులుగా ఇచ్చారు. వీటిలో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘ది క్రెసెంట్ మూన్’, విష్ణుశర్మ రచించిన ‘పంచతంత్ర’, ఆర్‌కే నారాయణ్ పుస్తకాలు ఉన్నాయి.దీనికి సంబంధించిన పిక్స్ ను మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.మస్క్ కుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందన్నారు. కొన్ని టాయ్స్ కూడా పిల్లలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.