అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కత్తితో పొడిచి నోట్లో యాసిడ్ పోసి అత్యాచారం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యువతి తలపై కత్తితో పొడిచి నోటిలో యాసిడ్ పోసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దారుణం జరిగింది. ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతి పై యువకుడు యాసిడ్ దాడి చేశాడు.

నిందితుడు మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తించారు. అటు తీవ్రంగా గాయపడ్డ యువతిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో దాడికి పాల్పడ్డాడు నిందితుడు. యువతి తలపై కత్తితో పొడిచి నోటిలో యాసిడ్ పోసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.