నాన్న ఫోన్ కొని ఇవ్వలేదని అమ్మ చీర తో ఉరి..!

-

ఆన్​లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు తండ్రి ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ పదో తరగతి విద్యార్థి. ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక తప్పకుండా కొనిస్తానని చెప్పిన నాన్నకు తీరని శోకం మిగిల్చి తిరిగిరాని లోకాలు వెళ్లిపోయాడు తమిళనాడుకు చెందిన బాలుడు. తమిళనాడు కడలూరు జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆన్​లైన్ క్లాసులు వినలేకపోతున్నాననే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

hang

కరోనా కాలంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలు తెరవకుండా.. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది తమిళనాడు విద్యాశాఖ. ఈ నేపథ్యంలో కడలూరు, పన్రూటి గ్రామానికి చెందిన 14 ఏళ్ల విగ్నేష్ దగ్గర స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లేదు. జీడిపప్పుల వ్యాపారం చేసే తండ్రి వినయ్ కుమార్​ను ఫోన్ కొనివ్వాల్సిందిగా కోరాడు. కానీ, లాక్​డౌన్ కారణంగా వ్యాపారం పడిపోయిందని కాస్త డబ్బు రాగానే కొనిస్తాన్నాడు వినయ్.స్నేహితులంతా ఆన్​లైన్ తరగతులకు హాజరవుతున్నారని, తాను మాత్రమే పాఠాలు వినట్లేదని మొండికేశాడు విగ్నేష్. ఆపై తీవ్ర మనస్థాపానికి గురై అమ్మ చీరతో ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version