ఈ మధ్య తెలుగు సినిమాల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇంతకీ అదేంటా అనుకుంటున్నారా. బూతులు. అవునండి మీరు విన్నది నిజమే. ఈ మధ్య తెలుగు సినిమాల్లో దీని డోసు కాస్త ఎక్కువే అవుతోంది. ఇప్పటి వరకు మసాలా మాత్రమే వడ్డించిన సినిమాలు ఇప్పుడు బూతులను కూడా వడ్డిస్తున్నాయి.
మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ సినిమాలో కూడా కొన్ని బూతులు వినిపించాయంటే వీటి డోస్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో కొన్ని వెబ్‌సిరీస్ లలో బూతులే బాగా పాపులర్ అవుతుండటంతో.. వీటిని సినిమాల్లో కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, విశ్వక్‌సేన్ లాంటి హీరోల సినిమాల్లో ఇవి తరచుగా వినిపిస్తుంటాయి.
ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇవి పరిపాటిగా మారిపోయాయి. మరి ఈ సాంప్రదాయం మంచిదా కాదా అనేది ఇప్పుడు సమస్య. తమ అభిమాన హీరోలు ఇలాంటి బూతులు మాట్లాడటం ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కానీ సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాల్లో ఇలాంటి ఎంతమాత్రం మంచివి కావని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా టాలీవుడ్ అనవసర ప్రయోగాలు చేస్తోందని చెప్పాలి.