కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయింది. వెబ్‌సైట్‌ను పాక్ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలిసింది. ఆగష్టు 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది ఆగస్టు 25 నాడు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించింది. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఆయన వ్యక్తిగత సమాచారం, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటించింది.
Pakistan based hackers target personal website of MoS (Home) G Kishan Reddy, now temporarily unavailable
Read @ANI Story | https://t.co/mRCiJzvwV5 pic.twitter.com/P7eBdBJcOL
— ANI Digital (@ani_digital) August 25, 2020
ఇప్పటికీ ఆ వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదు. సమస్య పరిష్కారం కోసం సైబర్ నిపుణులు పనిచేస్తున్నారు. కాగా, ఈ వెబ్‌సైట్ లో భారత్ లేదా భారత పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందులో లేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన డేటా కూడా అందులో ఏమీ లేదన్నారు. అయితే గతంలో కూడా ఒకసారి కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.