మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

-

అక్కినేని హీరో అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను అక్టోబ‌ర్ 8న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాను బ‌న్నీ వాసు, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.

జీఏ-2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం గ‌డుస్తున్నా క‌రోనా నేప‌థ్యంలో సినిమా విడుద‌లను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. ఇక తాజాగా అక్టోబ‌ర్ బ‌రిలోకి దిగుతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించడంతో అక్కినేని అభిమానులు కుషీ అవుతున్నారు. ఇక ఇదే రోజున మెగా మేన‌ల్లుడు వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన కొండ‌పొలం సినిమా విడుద‌ల కానుంది. దాంతో రెండు సినిమాల మ‌ధ్య పోటీ నెల‌కొన‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version