మన వంటింళ్ళలో ఉప్పు అనివార్యమైనది. అది లేకుండా ఒక్క వంట పదార్థం కూడా సిద్ధం కాదు. ఎన్ని సుగంధ ద్రవ్యాలు వేసినా ఉప్పు వేయకపోతే దాని లోటు స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు గొప్పలు పోతుంటుందని చెబుతారు. వంటలకి రుచిని అందించి నోటికి కమ్మదనాన్ని అందించే ఉప్పులో అయోడిన్ ఉండాలి. లేదంటే శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. డాక్టర్లు, పోషకాహార నిపుణులు కూడా అయోడిన్ ఉన్న ఉప్పునే వాడమని సలహా ఇస్తుంటారు.
అయోడిన్ వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. అందువల్ల భారతదేశ అయోడిన్ లోప నియంత్రణ సంస్థ, ప్రతీ ఇళ్ళలో వాడే ఉప్పులో ఖచ్చితంగా అయోడిన్ ఉండాలని సూచించింది. ఐతే చాలా సార్లు అయోడిన్ ఉప్పు సాధారణ ఉప్పుతో కల్తీ అవుతుంది. సాధారణ ఉప్పును అయోడిన్ ఉప్పు అని చెప్పి అమ్మేస్తున్నారు. దీనివల్ల శరీరానికి హాని కలుగుతుంది. అందుకే మీ వద్ద ఉన్న ఉప్పులో సాధారణ ఉప్పు కల్తీ జరిగిందా లేదా అన్న అంశాన్ని తెలుసుకోవాలి.
దీనికోసం ప్రయోగశాలకు వెళ్ళాల్సిన పనిలేదు. చిన్న చిట్కాతో తెలిసిపోతుంది. అదెలాగో ఇక్కడ చూడండి.
ఈ మేరకు Food Safety and Standards Authority of India (FSSAI) ఒక వీడియోను విడుదల చేసింది.
Detecting common salt adulteration in iodised salt.#DetectingFoodAdulterants_2@MIB_India@PIB_India @mygovindia @MoHFW_INDIA pic.twitter.com/uSjDcbASPN
— FSSAI (@fssaiindia) August 25, 2021
పద్దతి
ఒక బంగాళదుంపను తీసుకుని రెండు ముక్కలుగా కోయండి.
మీ వద్ద ఉన్న ఉప్పు తీసుకుని బంగాళ దుంప ముక్కల మీద ఉంచండి.
ఇప్పుడు రెండు చుక్కల నిమ్మ రసాన్ని రెండు ముక్కల మీద పోయండి.
ఒకవేళ బంగాళదుంప రంగు మారకపోతే దానిలో కల్తీ కాలేదని అర్థం.
బంగాళ దుంప రంగు నీలిరంగులోకి మారితే అందులో కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి.