తల్లీ కొడుకులను దగ్గర చేసిన లాక్ డౌన్…!

-

కరోనా దెబ్బకు ఇప్పుడు కొందరు తిండి లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాయా కష్టం చేసుకునే వాళ్ళు అయితే బ్రతుకు మీద ఆశలు కూడా వదిలేసారు. తినడానికి తిండి లేక రోడ్డున పడ్డారు. రోడ్డు మీద కూడా వాళ్లకు తినడానికి తిండి లేదు. బిచ్చం ఎత్తుకున్నా సరే వేసే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. అయితే తెలంగాణా రాజధాని హైదరబాద్ లో ఒక ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది.

అది ఏంటీ అంటే… యాదగిరిగుట్ట మండలం సాదువెల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ అంబర్‌పేట పటేల్‌నగర్‌లో ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఆమె వయసు 55 ఏళ్ళు. నాలుగేళ్ళు గా కొడుకుకి దూరంగా ఉంటుంది ఆమె. లాక్ డౌన్ దెబ్బకు ఆమెకు ఆహారం దొరకలేదు. దీనితో ఏడుస్తూ స్థానికులకు కనపడటం తో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ కనపడింది.

అంబర్‌పేట పోలీసులకు, కార్పొరేటర్‌ పులి జగన్‌కు విషయం చెప్పగా… యాదగిరిగుట్ట పోలీసులకు సమాచారం వెళ్ళింది. వారు అందరూ ఆమె తో మాట్లాడగా కొడుకు ఉన్నాడని చెప్పింది. ప్రత్యేక అనుమతితో కొడుకు వద్దకు ఆమెను తరలించారు. అయితే నాలుగేళ్ళు గా ఆమెకు దూరంగా ఉన్న కొడుకు ఆమెకు దగ్గరయ్యాడు.దీనిపై పోలీసులు హర్షం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version