లావు తగ్గడానికి పనికొచ్చే మోటివేషన్.. బాగా పనిచేస్తుంది.

-

లావుగా ఉన్నవారు సన్నగా ఉన్నవారిని చూసి ఈర్ష్య పడుతూ ఉంటారు. తాము కూడా అలా సన్నగా మారితే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తారు. ఐతే ఆ ఆలోచన ఎప్పుడైతే ఆచరణగా మారుతుందో అప్పుడే లావు తగ్గడం ప్రారంభిస్తారు. ఆ ఆలోచన అలాగే ఉండి ముందుకు కదలకపోతే వాళ్ళు కూడా ముందుకు కదలడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా సన్నగా మారాలని అనుకునే వారు అలా కావడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా మంచిది.

ముందుగా మీ చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. అప్పటి దాకా మిమ్మల్ని అంతగా పట్టించుకోని వారు కూడా మీరు సన్నగా నాజూగ్గా కనిపించగానే ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఎదుటి వారి కళ్ళలో కనిపించే ఆ ఆశ్చర్యం చాలా కిక్ ఇస్తుంది. అది మీలో నమ్మకాన్ని మరింత పెంచుతుంది. మీలో కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది.

కొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంతకుముందు నావల్ల కాదు అనుకున్నది చేయడానికి సిద్ధపడతారు. అందుకు మీ మనసు సిద్ధంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడదు. ఉఛ్వాస నిశ్వాసాలు మెరుగవుతాయి. అది మీలో ఎనర్జీని నింపుతుంది.

మీరు కావాల్సిన బట్టలు ఈజీగా దొరుకుతాయి. అందులో మీరు మరింత అందంగా కనబడతారు. ముఖ్యంగా గురక తగ్గిపోతుంది. మీ పక్కనున్నవారి నుండి కంప్లైంట్స్ పూర్తిగా తగ్గుతాయి. శృంగారంలో మునుపటి కంటే ఎక్కువ వేగం ఉంటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు తగ్గిపోతాయి. హార్ట్ ఎటాక్ ప్రమాదం తక్కువ. ఎక్కువ దూరం నడవగలుగుతారు. దానివల్ల మీ మోకాళ్ళు నొప్పిగా అనిపించవు.

మీరు లావు తగ్గితే మీ జీవిత భాగస్వామి కూడా లావు తగ్గడానికి ప్రయత్నిస్తారు. దాంతో పాటు మీ పిల్లలు కూడా. ఇలా ఒక్కొక్కరుగా పూర్తిగా మీ కుటుంబమే ఆరోగ్యంగా తయారవుతుంది. సో.. ఇంతకన్నా మోటివేషన్ ఇంకేం కావాలి. మరి ఇంకా కారణాలు చెప్పకండి. వెంటనే డైట్ ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version