ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌తో సీఎస్ నీలం సాహ్ని భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆమెతో చర్చించారు రమేష్ కుమార్. అయితే ఎస్ఈసీ-సీఎస్ భేటీలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి మీదే ప్రధాన చర్చ జరిగింది. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కరోనా బారిన పడ్డారని లెక్కలతో సహా ఎస్ఈసీ రమేష్ కుమార్ కు సీఎస్ వివరించారట. ఎన్నికలకు అతి కీలకమైన పోలీసు శాఖలోనే వేల సంఖ్యలో కరోనా కేసులున్నట్టు ఎస్ఈసీ దృష్టికి నీలం సహానీ తీసుకు వెళ్ళారని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహాణ అనేది కష్టమని సీఎస్ నీలం సాహ్నీ రమేష్ కుమార్ కి తేల్చి చెప్పినట్టు చెబుతున్నారు. ఈ కరోనా పరిస్థితులు అన్నీ కుదటపడగానే ఎస్ఈసీని మేమే సంప్రదిస్తామని వెల్లడించారని అంటున్నారు. అలానే రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ఎస్ఈసీకి ఎప్పటికప్పుడు వివరిస్తామని సీఎస్ రమేష్ కుమార్ తో పేర్కొన్నట్టు చెబుతున్నారు. అంతకు ముందు అఖిలపక్షనేతలతో రమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. జనసేన …ఈ మెయిల్ ద్వారా అభిప్రాయం తెలిపింది.