లాంచ్‌ అయిన Moto G32..బడ్జెట్‌లో అదిరిపోయో ఫీచర్స్..!

-

మోటో నుంచి కొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే Moto G32. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్.. ప్రస్తుతానికి ఒక్క వేరియంట్‌లోనే ఈ ఫోన్‌ను విడుదల చేశారు. జీ సిరీస్‌లో భాగంగా లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ విశేషాలేంటో చూసేయండి..!
Moto G32 ధర
Moto G32 స్మార్ట్‌ఫోన్‌ను 4 GB RAM, 128 GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల చేశారు.
యూరోపియన్ మార్కెట్‌లలో దీని ధర 209.99 యూరోలు (సుమారు రూ. 17,000) గా ఉంది. ఈ ఫోన్ మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ మోటరోలా ఫోన్ త్వరలో లాటిన్ అమెరికన్, ఇండియన్ మార్కెట్‌లలో కూడా విడుదల కానుంది.
Moto G32 స్పెసిఫికేషన్స్…
Moto G32 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పంచ్-హోల్ ఆప్షన్‌ను అందించారు. స్క్రీన్ FullHD+ రిజల్యూషన్‌తో రూపొందించారు.
ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
Moto G32 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరెట్‌తో వస్తుంది.
ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.
హ్యాండ్‌సెట్ కొలతలు 161.78×73.84×8.49 మిల్లీమీటర్లు, బరువు 184 గ్రాములు.
హ్యాండ్‌సెట్‌కు పవర్ అందించడానికి, 5000mAh బ్యాటరీ అందించబడింది.
ఇది 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది.
ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌లో USB టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇది కాకుండా, ఫోన్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC కనెక్టివిటీని అందిస్తుంది.
స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా ఈ Motorola G32 స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌ను అందించారు.
గ్రాఫిక్స్ కోసం Adreno 610 GPU అందించారు. ఫోన్ 4 GB RAM , 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.
Motorola G32లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.
హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ ఉంది.
ఎపర్చరు F / 2.4. కెమెరా పూర్తి-HD వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు.
ఎపర్చరు F / 1.8తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, ఎపర్చరు F / 2.2తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, ఎపర్చరు F / 2.4తో 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version