మొబైల్స్ తయారీ సంస్థ మోటోరోలా తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ ప్లస్‌ను భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఉన్న ఓలెడ్ ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 865 అధునాతన ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 5జి వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తోంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు 16 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న అల్ట్రావైట్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో ఏకంగా 6కె వీడియోలను షూట్ చేసుకోవచ్చు. ఇక గతంలో వచ్చిన ఇతర మోటో ఫోన్ల కన్నాఈ ఫోన్లోని స్పీకర్ 60 శాతం ఎక్కువ పెద్దదైన శబ్దం ఇస్తుంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
మోటోరోలా ఎడ్జ్ ప్లస్ స్పెసిఫికేషన్లు…
* 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే
* 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్
* 256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 108, 16, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 25 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6 802.11 ఏక్స్
* బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
* వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్
మోటోరోలా ఎడ్జ్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ కేవలం థండర్ గ్రే కలర్ ఆప్షన్లో మాత్రమే విడుదలైంది. రూ.74,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ళో లభ్యం కానుంది. దీనికి గాను ప్రస్తుతం ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.7,500 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.