కాల్పుల విరమణకు ఒకే అని చెప్పి రాత్రి కాగానే కాల్పులకు తెగబడిన పాక్.. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. నిన్న రాత్రి పాక్ నుంచి డ్రోన్లు ఆదేశంతో సరిహద్దులు పంచుకుంటున్న భారత భూభాగంలోనికి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చాయి. తాజాగా పీఎం మోడీ అధ్యక్షతన త్రివిధ దళాలు, సీడీఎస్ చీఫ్, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం అయ్యారు.
ఇదిలాఉండగా, భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రజలు కూడా శాంతి కోరుకుంటున్నారు. కాల్పుల విరమణ అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అని.. కేంద్రం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో త్వరలో అన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.