పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని.. పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం చేపట్టామని తెలిపారు. భారత సంకల్పాన్ని ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం అని.. ఉగ్రవాదాన్ని భారత్ సహించదు. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదు. కానీ భారత ప్రజలపై పాక్ దాడి చేసిందని తెలిపారు.
ప్రతిసారి మన శక్తిని ప్రపంచానికి చూపించామని పర్కొన్నారు. మరోవైపు ఫేక్ న్యూస్ ని అస్సలు నమ్మవద్దని తెలిపారు. కేవలం పాక్ సరిహద్దు పై కాదు.. రావల్పిండి పై కూడా దాడి చేశాం. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సిందూర్ తో ప్రధాని స్పస్టం చేశారు. పాకిస్తాన్ ఆలయాలు, గురుద్వారాలపై దాడి చేసింది. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడుల తరువాత ప్రతీ సారి మన శక్తిని ప్రపంచానికి చూపించామని తెలిపారు.