అల్లు అర్జున్ అరెస్టును కావాలనే రాజకీయం చేస్తున్నారు : ఎంపీ చామల కిరణ్

-

అల్లు అర్జున్ అరెస్టును కావాలనే బీజేపీ రాజకీయం చేస్తుంది అని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేంద్రమంత్రుల నుండి.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వరకు అందరూ ఈ అరెస్ట్ పై మాట్లాడుతున్నారు. పుష్ప 2 సినిమా ఇష్యూలో మైలేజ్ తీసుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారు అని చామల కిరణ్ అన్నారు.

అయితే యోగి ప్రభుత్వంలో ఓ స్వామీజీ మీటింగ్ పెడితే వంద మంది చనిపోయారు. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఈ సినిమాల వల్ల సమస్య తెలుసుకునే ఆలోచనతోనే ఇండస్ట్రీలో ఉన్న దిల్ రాజ్ కి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. ఇక Mim అడిగిన ప్రశ్నకు సభలో సీఎం రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే బండి సంజయ్, పురంధేశ్వరి ప్రదాని రిలీఫ్ ఫండ్ నుండి ఆ కుంబానికి ఫేబ్బులు ఇప్పించండి. ఆ చనిపోయిన మహిళకు సాయం చేయిస్తే పోయేది ఏముంది.. మీకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు చామల కిరణ్.

Read more RELATED
Recommended to you

Latest news