గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్బంగా శాసనసభలో గందగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేయడంపై ఆయన గరం అయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ మీద కూడా సీరియస్ అయ్యారు.
దీంతో ఆయన్ను సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆమరణ నిరహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. తాజాగా కేటీఆర్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేస్తా అనడం విడ్డూరంగా ఉంది.ఉద్యమం టైం నుండే మీ నాయన దళితులను మోసం చేస్తున్నాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సార్లు దళితులను అవమానించారు.ఆనాడు నామ మాత్రంగా రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి బర్తరఫ్ చేశారు.కారణాలు ఏంటో ఇప్పటికీ చెప్పలేదు’ అని ఎంపీ వెల్లడించారు.