కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అప్రజాస్వామిక, నిజాం నియంతృత్వ పాలనపై తెలంగాణ ఉద్యమం స్థాయిలో మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మూడో దశ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు హటావో తెలంగాణ కో బచావో, బీజేపీకి జితావో నినాదంతో పోరాటాలు చేస్తామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిందితప్ప.. తెలంగాణ ప్రజలకి దక్కింది ఏమీ లేదు అని వెల్లడించారు లక్ష్మణ్.
బందుల పేరిట అన్ని బంద్ చేశారు.. బీజేపీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సబ్బండ వర్గాలను ఆహ్వానిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కోరారు.కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్ర విముక్తి కై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు, అర్హులైన వారికే పథకాలు అందాలని ఉద్యమం చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.
ఆగస్ట్ 16న పల్లె బాట, బస్తీ బాటతో ప్రారంభమై.. ఆగస్ట్ 17 న బస్తీ డివిజన్ వారీగా ఆందోళనలు.. అసెంబ్లీ కేంద్రాల్లో రాస్తారోకో,
దిగ్బంధనం, ముట్టడితో పాటు ఆగస్ట్ 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావు.. ఆగస్ట్ 24న మంత్రుల ఘెరావ్.. ఆగస్ట్ 25న కలెక్టరేట్ల ముట్టడి.. మిలియన్ మార్చ్ తలపించే విధంగా సెప్టెంబర్ మొదటి వారం లో హైదరాబాద్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు సహాకరించాలని ఆయన కోరారు.