యోగాతో చాలా లాభాలు: మోదీ

-

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చాలా ప్రాణాలు పోయాయని ప్రధాని మోదీ పేర్నొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కారోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మోదీ తెలిపారు. కరోనా కట్టడికి డాక్టర్ల, పోలీసులు, తదితర సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. యోగా ఆసనాల ద్వారా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చని సూచించారు. యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలన్నారు.

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉండన్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని ప్రధాని పేర్కొన్నారు. యోగా వల్ల ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. యోగా వల్ల ఆయుష్యును పెంచుకోవచ్చారు. యోగా చేయడం వల్ల తాను ఆరోగ్యం ఉన్నానని మోదీ స్పష్టం చేశారు. కరోనా సమయంలో తన పిలుపుతో చాలా స్కూళ్లు ఆన్ లైన్ ద్వారా యోగా కార్యక్రమాలు నిర్వహించాయని తెలిపారు. యోగా మనిషిలో ఒక భాగం కావాలని ప్రధాని సందేశమిచ్చారు. ఇందుకోసం యోగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని స్పష్టం చేశారు. యోగాను ప్రమాణంగా తీసుకోవాలని చెప్పారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.

కాగా అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని  ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో 190 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. యోగా ఫర్ వెల్ నెస్’అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడో అంతర్జాతీయ యోగా డేగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version