లోక్‌సభ స్పీకర్‌గా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై స్పందించేందుకు ఎంపీ పురంధేశ్వరి నిరాకరించారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధే ప్రధాన ధ్యేయమని చెప్పారు. కేంద్రమంత్రి పదవుల్లో రాష్ట్రానికి న్యాయం జరిగింది. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి పార్టీ కోసం కష్టపడి పని చేసిన శ్రీనివాసవర్మను బీజేపీ హైకమాండ్ గుర్తించింది.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి పని చేస్తుంది. విభజన హామీలు అమలు చేసేలా ప్రయత్నం చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తాం.’ అని పురంధేశ్వరి తెలిపారు. అయితే స్పీకర్ పదవిపై ఎంపీ పురంధేశ్వరి స్పందించకపోవడం వెనక కారణాలేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం నుంచి ఆమెకు సమాచారం లేదని కొందరు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.