జగన్ పై మరోసారి రఘురామకృష్ణరాజు విమర్శలు

-

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు. తాడేపల్లి ప్యాలెస్ ను దాటి జగన్ బయటకు రారని… ఇంటి నుంచి బయటకు వస్తే ఎన్నో చెట్లను నరికివేస్తారని, స్థానికంగా ఉన్న జనాలకు ఉపాధి పోతుందని మండిపడ్డారు ఆయన. నేడు పోలవరంలో ఉన్న నేతలను జగన్ కలుస్తున్నారని తెలిపారు. సాధారణంగా జగన్ ఎవరినీ కలవరని, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని గ్రహించి ఇప్పుడు కలుస్తున్నారని వెల్లడించారు ఎంపీ రఘురామ. పోలవరం ప్రాంతంలో జగన్ పర్యటనలో అసలైన వరద బాధితులను వైసీపీ నేతలు మాట్లాడనివ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో జగన్ స్క్రిప్ట్ చదివారని హేళన చేశారు. విపక్ష నేతల యాత్రల్లో జనాలను చూస్తే తమ పార్టీ వాళ్లకు కోపం వస్తుందని పేర్కొన్నారు ఆయన. ఢిల్లీ ఆర్డినెన్సుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత తమ పార్టీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదని వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ సినిమా గురించి మాట్లాడటం మానేసి… పోలవరం ప్రాజెక్టు అంశాన్ని చూడాలని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version