జగన్‌కు రఘురామ మరో డిమాండ్

-

న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో డిమాండ్ పెడ్డారు. నవతర్నాలల్లో భాగంగా ప్రజలకు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు పెంపును ఇవ్వాలంటూ ఇప్పటికే లేఖ రాసిన రఘురామ శనివారం మరో లేఖాస్త్రం సంధించారు. వైఎస్సార్ పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై ఆయన ప్రస్తావించారు. పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే పెళ్లి కానుక ఆర్థికసాయం పెంచుతామని జగన్ చెప్పిన హామీని ఆయన లేఖలో గుర్తు చేశారు. పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని అప్పట్లో చెప్పారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని రఘురామ లేఖలో డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే రఘురామరాజుపై శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓ బిర్లాకు ఫిర్యాదు చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రఘురామ అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.

కాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు -వైసీపీ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా రఘురామ అరెస్ట్ తరువాత ఇది మరింత ముదిరింది. మరోవైపు తనను కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో జాతీయ రాజకీయాల్లోనూ చర్చగా మారింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత.. ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. తనకు జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు రాశారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే రఘురామ లేఖలు రాశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version