నిర్మాత అవ‌తారం ఎత్త‌బోతున్న‌ న‌మ్ర‌త‌.. మ‌హేశ్ అండ‌గా!

-

ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో బాగా పాపుల‌ర్ అయితే చాలు అంద‌రూ నిర్మాత‌ల అవ‌తారం ఎత్తుతున్నారు. ఇంకొంద‌రు ఇత‌ర బిజినెస్‌లు చూసుకుంటున్నారు. ఇప్ప‌టికే చాలామంది హీరోలు ఈ విష‌యంలో ముందడుగు వేశారు. అయితే ఇప్పుడు మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త నిర్మాత అవ‌తారం ఎత్త‌బోతున్నారు. ఓయంగ్ హీరోతో మంచి ఫీల్ గుడ్ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు.

 

పెండ్లి అయిన‌ప్ప‌టి నుంచి ఆమె సినిమాల‌కు దూరంగానే ఉంటున్నారు. అప్ప‌టి నుంచి త‌మ బిజినెస్ లు మాత్ర‌మే చూసుకుంటున్నారు ఈమె. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. దీంతో న‌మ్ర‌త మ‌హేశ్‌కు సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె నేరుగా సినీ నిర్మాతగా మారబోతున్నారట. ఓ డైరెక్టర్ తో ఇప్ప‌టికే సినిమా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మ‌చారం. ఇండ‌స్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరో అయిన శర్వానంద్ హీరోగా ఆమె సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఒక మంచి ఫీల్ గుడ్ వ‌చ్చే సినిమాను న‌మ్ర‌త ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అప్‌డేట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి వీరి సినిమా ఏస్థాయిలో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version