9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది : ఎంపీ ఉత్తమ్‌

-

సీఎం కేసీఆర్‌ సర్కార్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ) సెటైర్లు వేశారు. 9 ఏళ్లు పూర్తైన తెలంగాణ లో దశాబ్ది ఉత్సవాలు విడ్డూరమన్నారు. ఎన్నికల కోసమే దశాబ్ది ఉత్సవాలు అని విమర్శించారు. రాజకీయాలు కమర్షియల్‌ అయింది వాస్తవమన్నారు. కమర్షియల్ రాజకీయాలు తాను చేయలేనన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీచేస్తానని ఉత్తమ్‌ తెలిపారు. పోలీస్, విద్యుత్ రెవెన్యూ, శాఖలను ఏ విధంగా నిర్వీర్యం చేశామని చెబితే బాగుంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రస్తుత ఎంపీగా అనేక మంది ముఖ్యమంత్రిలను దగ్గరగా చూసానని ప్రభుత్వ యంత్రాంగాలను నిర్వీర్యం చేసి బ్రష్టు పట్టించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.

రైతు ఉత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రైతులను తెలంగాణ లో అణిచివేసే ధోరణి పాటిస్తుందని రైతులకు కావలసిన రుణమాఫీ బ్యాంకు రుణాలు సబ్సిడీలు అందించడంలో 9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని వాటి గురించి ఉత్సవాలలో చెప్తే బాగుంటుందని ఆయన విమర్శించారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల భూములను గిరిజన భూములను ఏ విధంగా లాక్కున్నారో, తక్కువ టైం లో ఎక్కువ సంపాదించుకోవడంలో ఏ విధంగా సఫలీకృతమయ్యారో వివరిస్తే ప్రజలు మెచ్చుకుంటారని ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, బీరు షాపుల వద్ద లంచాల వరకు ఎమ్మెల్యే కనసనలు జరుగుతున్నాయని ఉత్తమ్ విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version