అంబేద్కర్ విగ్రహం ముందు ఉద్యమ కళాకారుల భిక్షాటన

-

ట్యాంక్ బండ్ పై ఉన్న 125 అడుగుల ఎతైన అంబేద్కర్ విగ్రహం ముందు పాటలు పాడి, భిక్షాటన చేశారు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు. ఉద్యమంలో కాళ్లకు గజ్జలు కట్టి ఆడి పాడిన తమను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. . ఉద్యమంలో పాల్గొన్న నిజమైన కళాకారులకు కాకుండా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తమ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని వారు వెల్లడించారు. ఈ విషయంపై సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన అసలు వారిని పట్టించుకోలేదని తెలిపారు.

ఉద్యోగం వస్తుందని గత ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నామని, కుటుంబ పోషణ కూడా భారమైందని ఉద్యమ కళాకారులు కన్నీరు కార్చారు. కన్నెసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని మిగిలిన 350 మంది ఉన్న కళాకారులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు కోరారు. లేనిపక్షంలో ఏ పాటతో అయితే స్వరాష్ట్రం సాదించుకున్నామో.. అదే పాటతో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పాటలు పాడి తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version