శాసన మండలి రద్దుపై తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలని చంద్రబాబు విసురుతున్న సవాళ్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయాలని ఆయన సవాలు విసిరారు. ‘దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే కౌన్సిల్ రద్దును సమర్థిస్తామని రంకెలు వేసే బదులు మీరంతా రిజైన్ చేసి గెలవండి. రిఫరెండంగా భావిస్తాం. నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చేయడు. ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ!’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.