ఎంపీడీఓ కార్యాలయంలో భార్యల కుర్చీల కోసం భర్తల కొట్లాట

-

పదవి ఆమెది.. పెత్తనం ఆయనది. మహిళలు ఎన్నికల్లో గెలిచి పదవులు స్వీకరిస్తుంటే పెత్తనం మాత్రం వారి భర్తలది నడుస్తోంది. భారత రాజ్యాంగం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి మరీ చట్టసభల్లో, పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానాలు కల్పిస్తుంటే.. వారి భర్తలు మాత్రం ప్రమాణ స్వీకారం అయిన తెల్లవారే వారిని వంటింటికి పరిమితం చేస్తున్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఓ ఇద్దరు పురుషులు తమ భార్యల కుర్చీ కోసం గొడవపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో చోటుచేసుకుంది.

కార్యాలయం మొదటి అంతస్థులో మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా గ్రౌండ్​ ఫ్లోర్​లో ఎంపీపీ భర్తకు, ఎంపీటీసీల భర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధి పనులు నిధుల కేటాయింపునకు సంబంధించి ఇద్దరు గొడవపడ్డారు. అంతే కాకుండా ఎంపీపీ ఛాంబర్​లోకి ఎంపీటీసీల భర్తలు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

అలాంటప్పుడు ఎంపీపీ భర్త ఎంపీపీ ఛాంబర్​లోకి ఎలా వెళ్తారని ఎంపీటీసీల భర్తలు ప్రశ్నించారు. మాటలు తీవ్ర స్థాయికి పెరగడంతో అక్కడ ఉన్న కార్యాలయ సిబ్బంది వారికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు. ఇందులో ఉన్నవారందరూ అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version